सोमवार, 1 दिसंबर 2014

గర్వం

ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు వుంది. దాని మొదలు చాలా లావుగాను చాలా బలంగానూ వుంది. ఆ చెట్టు చాలా గుబురుగా కళకళలాడుతూ వుంది. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు గూడ్లు పెట్టుకొని నివసిస్తున్నాయి. ఒక రోజు ఆ అడవి చుట్టుప్రక్కల ప్రాంతాలలో వర్షం కురిసింది. తెరిపిలేని వాన. దానితో అడవి చుట్టుపక్కల ప్రాంతాలలో వరద పొంగుకొచ్చింది. తమనుతాము కాపుడుకోటానికి జంతువులు, పక్షులు అన్ని ఆ చెట్టు నీడకై పరుగులు తీసాయి. మూడు-నలుగు రోజులు గడచినా వర్షం తెరిపించలేదు. అన్ని జంతువులూ దిక్కు తోచని పరిస్థితిలో పడిపోయాయి. కొద్దిగా వాన తెరిపించింది. దానితో అన్ని జంతువులూ చెట్టుకి కృతజ్ఞతలు తెలుపుతూ మెల్లగా తమ తమ నివాస స్థలాలకు వెల్ల సాగాయి. నేనే లేకపొతే ఈ జంతువుల పరిస్థితి ఏమిటి అని ఆలోచించింది చెట్టు. దానితో ఆ చెట్టుకి గర్వం పెరిగింది. ఇంకేముంది! ఆ తర్వాత అందరితో మాట్లాడటం మానేసింది. నేనే గొప్ప అనే భావం పెంచుకుంది. జంతువులను, పక్షులను తన దరికి కూడా రానివ్వకుండా అడ్డుకట్ట వేసింది. దానితో పక్షులన్నీ తెల్లబోయాయి. చెట్టు మీద కాకపోతే తాము గూడ్లు ఎకడ్డ కట్టుకోవాలి. చెట్టుతో మొర పెట్టుకున్నా అది ససేమిరా అనడంతో చేసేది ఏమిలేక నిరాశతో వెళ్లిపోయాయి. గజరాజు నచ్చ చెప్పిన చెట్టు వినలేదు. ఒక రోజు కొంతమంది వ్యక్తులు కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వచ్చారు. చెట్టు చాలా పెద్దగా వున్నందున దాని మొదలును గొడ్డలితో నరకడం మొదలు పెట్టారు. చెట్టు విలవిలలాడింది. తనని కాపాడమని అర్ధించింది. జంతువులన్నీ ఒకటై కట్టెలు కొట్టేవాళ్ళ మీదకు దాడి చేసాయి. దానితో గొడ్డళ్ళు అక్కడికక్కడే వదిలేసి వారు బ్రతుకుజీవుడా అని పారిపోయారు. ఆ చెట్టు గర్వం కాస్తా తునాతునకలైంది.

कोई टिप्पणी नहीं: